రాష్ట్రంలో 33 జిల్లాల్లో 20 లక్షల సభ్యత్వాలు నమోదు చేయడమే లక్ష్యంగా... భాజపా ముందుకెళ్తోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ ఛైర్మన్ దుగ్యాల ప్రదీప్ అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొబైల్ ఫోన్ నుంచి డిజిటల్ రూపంలో సభ్యత్వం పొందే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గోపీనాథ్, మెదక్ జిల్లా అధ్యక్షుడు రామ్ చరణ్ యాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: నాతో గడిపితే మార్కులు వేస్తా..అధ్యాపకుని లైంగిక వేధింపులు..