మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజిపల్లి గ్రామానికి చెందిన కన్నెబోయిన ఎల్లయ్య గత 15 రోజుల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్లోని బహదూర్పురకు వెళ్లాడు. అక్కడ ఓ గడ్డి వ్యాపారి దగ్గర రోజు వారి కూలీగా పని చేస్తున్నాడు. శనివారం బాధితుడికి వాంతులు, విరేచనాలు అవుతున్నాయని ఎల్లయ్యను సదరు వ్యాపారి ఇంటికి వెళ్లమని చెప్పి జూబ్లీ బస్టాండ్లో మెదక్ బస్సులో ఎక్కించి స్వగ్రామం పంపించాడు.
సుమారు 3 గంటలకు...
మధ్యాహ్నం సుమారు 3 గంటలకు బస్సు కొల్చారం సమీపంలోని రాగానే దిగాల్సిన స్టేజీ దగ్గరికీ వచ్చిందని కండక్టర్ ఎల్లయ్యను లేపేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు. ఫలితంగా దాదాపు గంటసేపు మృతదేహం కొల్చారం పోలీస్ స్టేషన్ వద్ద ఉంచారు.
బోరున విలపించిన కుమార్తె...
విషయం తెలిసిన మృతుడి కూతురు విగత జీవిగా ఉన్న తండ్రిని చూసి బోరున విలపించింది. ఎల్లయ్య కరోనాతో మృతి చెందాడనే అనుమానంతో మృతదేహాన్ని ఊర్లోకి తీసుకురాకూడదని అప్పాజిపల్లి గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయంత్రం 4 గంటల సమయంలో అప్పాజిపల్లి సర్పంచ్ చొరవతో గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో ఎల్లయ్య మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
ఇవీ చూడండి : కేసీఆర్ రాష్ట్రాన్ని శ్మశానంగా మారుస్తున్నారు: పూసరాజు