ETV Bharat / state

మెడ పట్టి గెంటిస్తా.. రైతుపై ఆర్​ఐ ఆగ్రహం - R I angry at the farmer

సామాన్య ప్రజలకు సేవచేయాల్సిన ప్రభుత్వోద్యోగి దురుసుగా ప్రవర్తించిన ఘటన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండల రెవెన్యూ కార్యాలయంలో జరిగింది. తాను కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్​ చేయలని కోరగా ఆర్‌ఐ మెడపట్టి గెంటిస్తానన్నాడని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

medak district latest news
దురుసుగా ప్రవర్తించిన ప్రభుత్వోద్యోగి
author img

By

Published : Mar 27, 2021, 12:18 PM IST

కోనుగోలు చేసిన భూమిని తన పేరు మీద మార్చాలని కోరుతూ మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ రెవెన్యూ కార్యాలయానికి వచ్చిన రైతుపై అధికారి దురుసుగా ప్రవర్తించారు. గూడెంగడ్డ గ్రామానికి చెందిన ఆవంచ దుర్గయ్య, అతని ఇద్దరు తమ్ముళ్లు కలసి ఆరు గుంటల భూమిని ఒక వ్యక్తి నుంచి 6 నెలల క్రితం కోనుగోలు చేశారు. భూమిని ముగ్గురి పేర్లమీద మార్చాలని తహసీల్దార్​ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. ఇద్దరి పేర్ల మీద మారింది కానీ దుర్గయ్య పేరుమీద కాలేదు.

అమ్మినవారి ఖాతాలో 6 గుంటలు తీసేశారు. కొనుగోలు చేసిన వారికి మాత్రం నాలుగు గుంటలే చూపిస్తుంది. అప్పటినుంచి దుర్గయ్య దాదాపు రోజూ కార్యాలయానికి వచ్చి వెళుతున్నాడు. శుక్రవారం సాయంత్రం రెవెన్యూ కార్యాలయానికి వచ్చాడు. ఆర్‌ఐ ప్రవీన్‌రెడ్డి అతన్ని చూసి 'నీకేం పనిలేదా మళ్లీ వస్తే మెడపట్టి గెంటిస్తా..' అని ఆగ్రహంతో అన్నారని రైతు ఆరోపించాడు. తన సమస్య పరిష్కరించకుండా కార్యాలయం నుంచి గెంటేస్తానంటావా.. అని దుర్గయ్య ఆర్​ఐని నిలదీశాడు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. గమనించిన తహసీల్దార్​ మాలతి వెంటనే ఛాంబర్​ నుంచి బయటకు వచ్చి రైతుతో మాట్లాడారు. ఆర్‌ఐ ఎదుట నచ్చజెప్పారు. సాంకేతిక సమస్యతో దుర్గయ్య పేరుమీద రాలేదని.. పరిశీలించి త్వరలో పరిష్కరిస్తామని అధికారిణి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కరోనా నుంచి విముక్తి కోసం మోదీ పూజలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.