ETV Bharat / state

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి ఔదార్యం చాటుకున్న ఎమ్మెల్యే - మెదక్​ జిల్లాలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఔదార్యం

సేవాభావం కలిగిన ప్రజాప్రతినిధులు ఆపద సమయంలో ప్రజలను ఆదుకుంటున్నారు. మెదక్​ జిల్లా శంకరంపేట మండలం కొరివిపల్లి గ్రామ శివారులో ఓ ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి క్షతగాత్రులను ఆంబులెన్స్​లో ఏరియా ఆస్పత్రికి తరలించారు.

The MLA helps injured people in road accident in medak district
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి ఔదార్యం చాటుకున్న ఎమ్మెల్యే
author img

By

Published : Dec 2, 2020, 7:50 PM IST

మెదక్​ జిల్లా శంకరంపేట మండలం కొరివిపల్లి గ్రామశివారులో జరిగిన రోడ్డుప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అదే మార్గంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి గమనించి క్షతగాత్రులను ఆంబులెన్స్​లో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి ఔదార్యాన్ని చాటుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఎమ్మెల్యే సూచించారు.

మెదక్ నుంచి చేగుంట వెళ్లే రహదారిలో ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీకొన్న ఘటనలో కాజిపల్లికి చెందిన లాలూ, అతని కుటుంబసభ్యులు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన బస్సును పోలీస్​స్టేషన్​కు తరలించారు.

ఇదీ చూడండి:వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మరింత సరళతరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.