ప్లాస్టిక్ వల్ల ఆరోగ్యం, పర్యావరణం నాశనం అవుతాయని... ప్లాస్టిక్‌ను తరిమి కొట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. ప్లాస్టిక్ రహిత సమాజం కావాలంటే ప్రజలతో పాటు విద్యార్థులు కూడా భాగస్వామ్యం కావాల్సి ఉంటుందని తెలిపారు. ప్లాస్టిక్‌ను వినియోగించొద్దంటూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు. ధూమపానం చేస్తే... అది వారికి మాత్రమే నష్టమని... కానీ ప్లాస్టిక్ వాడితే అందరికీ నష్టం కలుగుతుందని స్పష్టం చేశారు.
ప్లాస్టిక్ భూమిలో కలవాలంటే లక్ష ఏళ్లు పడుతుందని... కానీ దానికి భిన్నంగా 11 నెలల్లోనే భూమిలో కలిసేలా నేషనల్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ప్లాస్టిక్ రహిత బ్యాగులను తయారు చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్ పర్సన్ లావణ్య రెడ్డి, గ్రంథాలయ ఛైర్మన్ చంద్ర గౌడ్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, నేషనల్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ విజయ్ రెడ్డి, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవాలి