మెదక్ సీఎస్ఐ చర్చి వద్ద సమస్త ఆత్మల దినం ఘనంగా నిర్వహించారు. ప్రపంచ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 2ను సమస్త ఆత్మ దినంగా జరుపుకుంటారు. కుటుంబాలను విడిచి దేవుని సన్నిధికి చేర్చబడినవారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేశారు. పెద్దల సమాధులను శుభ్రం చేసి కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసి సంతాపం తెలిపారు.
ఇదీ చూడండి: ఎంపీ సంజయ్ పట్ల దురుసుగా ప్రవర్తించలేదు: సీపీ