నాడు జలకళ ఉట్టిపడుతూ తాగు, సాగు నీరందించిన సింగూరు ప్రాజెక్టు నేడు నీరు లేక వెలవెలబోతోంది. గతేడాది నిండుకుండలా ఉన్న ప్రాజెక్టు నేడు అక్కడక్కడా ఉన్న నీటితో పశువుల దాహం మాత్రమే తీరుస్తోంది.
సింగూరు ప్రాజెక్టు సామర్థ్యం మొత్తం 30 టీఎంసీలు. నేడు పావు టీఎంసీకే పరిమితమైంది. రైతులకు కాలువల ద్వారా 25 వేల ఎకరాలకు సాగునీరందించే ఈ ప్రాజెక్టు గతేడాది నుంచి చుక్కనీరు లేక బోసిపోయింది. ప్రాజెక్టులో నీరు లేక, వానదేవుడు కరుణించక దుక్కి దున్నకున్న రైతులు వరణుడి రాకకై దీనంగా ఎదురుచూస్తున్నారు.
- ఇదీ చూడండి : వర్మ ట్రిపుల్ రైడింగ్.. పోలీసుల జరిమానా