పండించిన పంటలకు రైతే మద్దతు ధర నిర్ణయించుకునేలా చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్ పట్టణంలోని సాయి బాలాజీ గార్డెన్స్‌లో నియంత్రిత పంటల సాగుపై ఏర్పాటు చేసిన సదస్సులో ఎమ్మెల్సీ సుభాశ్ రెడ్డితో కల్సి పాల్గొన్నారు. అన్నదాతలకు ప్రయోజనం చేకూర్చడానికే సీఎం పంటల మార్పిడికి అంకురార్పణ చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సగటున ఏడాదికి రైతులపై రూ.70 వేల కోట్లు ఖర్చు పెడుతున్నా మనకు అవసరమైన ఉత్పత్తులను పండించడం లేదని ఎమ్మెల్సీ సుభాశ్ రెడ్డి స్పష్టం చేశారు.
మొక్కజొన్న స్థానంలో కంది, పత్తి సాగు చేయాలి
జిల్లాలో 2.60 లక్ష్లల ఎకరాల సాగు భూమి ఉందని, అందులో 30 వేల ఎకరాల్లో సాగు చేస్తున్న మొక్కజొన్న స్థానంలో కంది, పత్తి సాగు చేయాలని మంత్రి రైతులను కోరారు. ప్రస్తుతం 1.22 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నామని, కాళేశ్వరం నీళ్లు వస్తే ఆ విస్తీర్ణం 1.35 లక్షల ఎకరాలకు పెరుగుతుందన్నారు. వరి సన్న, దొడ్డు రకాలను చెరిసగం పండించాలని సూచించారు. ఇకపై దొడ్డురకం కంటే సన్నరకం ధాన్యానికి రూ.300 అధికంగా మద్దతు ధర ఇచ్చే విషయాన్ని సీఎం ఆలోచిస్తున్నారని వెల్లడించారు.
ఇదీ చూడండి: అక్రమ లే అవుట్లు 3,892