మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజక వర్గంలోని పలు గ్రామాల ప్రజలు ఇతరులు తమ ఊళ్లలోకి రాకుండా కంచెలు ఏర్పాటు చేసుకుంన్నారు. ముళ్లకంప, కర్రలు, దమ్ముచక్రాలు వంటి వాటితో కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల వారు తమతమ గ్రామాల్లోకి రాకుండా గ్రామాలను స్వీయ నిర్బంధంలో పెడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తు ఎవరి రక్షణలో వారు ఉంటున్నారు. గ్రామంలోని ప్రజలు కూడ బయటకు వెళ్లడంలేదు. గ్రామస్థులు ఇళ్లకే పరిమితమై కుటుంబసభ్యులతో గడుపుతున్నారు. ఇళ్ల వద్ద స్వంత పనులు చేసుకుంటున్నారు. కంచెలు తీయకుండ గ్రామాలకు చెందిన యువకులు పహారా కాస్తున్నారు.
ఇదీ చూడండి: కరోనాపై పోరులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే..