రెండు నెలలుగా వేతనాలు రాక తీవ్ర మనస్తాపానికి గురై ఓ కండక్టర్ పురుగుల మందు తాగిన ఘటన మెదక్ జిల్లా జమ్మికుంటలో చోటుచేసుకుంది. జమ్మికుంటలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న మైసయ్య.. మెదక్ డిపోలో 15 సంవత్సరాలుగా కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. సమ్మె నేపథ్యంలో ఆర్థిక భారం ఎక్కువై.. ఇంటి అద్దె, కూతురు ఫీజు కట్టలేక, కుటుంబ పోషణ భారంగా మారింది. తీవ్ర మనోవేదనకు గురైన మైసయ్య ఇంట్లో పురుగుల మందు తాగాడు. భార్య లక్ష్మి, ఇరుగుపొరుగు వారు మైసయ్యను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: జేబీఎస్ వద్ద రెండో రోజూ కార్మికుల అరెస్ట్