గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధి ధర్మారం-చేగుంట మధ్య రహదారిపై పెద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
గల్లంతైన రెండు ద్విచక్రవాహనాలు...
ధర్మారం గ్రామానికి చెందిన ఎర్రోళ్ల ఏల్లం చేగుంట నుంచి ధర్మారానికి వస్తున్న క్రమంలో నీటి ఉద్ధృతికి ద్విచక్ర వాహనం కొట్టుకుపోయింది. ఘటనలో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణ హాని జరగలేదు.
ఇవీ చూడండి : ఆన్లైన్ తరగతులు, ఫీజుల ఒత్తిడిపై హెచ్ఆర్సీని ఆశ్రయించిన శివ బాలాజీ