అటవీ ప్రాంతంలో ఆలయ దర్శనం తనకు ఎంతగానో నచ్చిందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శోభ అన్నారు. ఈ మేరకు మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చాకరిమెట్ల గ్రామంలోని అంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంజనేయ స్వామిని దర్శింకున్న అటవీ అధికారిణి శోభ అక్కడి వాతావరణం చాలా అహ్లదకరంగా ఉందని చెప్పారు. అంతకు ముందు నర్సాపూర్, శివ్వంపేట మండలాలలో గల అటవి ప్రాంతాలను ఆమె పరిశీలించారు. బహిరంగ ప్రదేశాలలో మొక్కలు నాటి పెంచాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎప్‌ఆర్వో అంబర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకోవాలి'