PCC Chief Revanth Reddy Participated Congress Meeting at Dubbaka : పదేళ్లలో కేసీఆర్ కుటుంబం బంగారుమయంగా మారింది తప్ప.. తెలంగాణను బొండాలగడ్డగా మార్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ధ్వజమెత్తారు. దుబ్బాకకు నిధులు రాకుండా సిద్దిపేటకు తరలించుకుపోవడం మామా, అల్లుళ్లకు అలవాటైపోయిందని అన్నారు. మెదక్ జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన పాల్గొని.. ప్రసంగించారు.
దుబ్బాక నియోజకవర్గ నిధులను కేసీఆర్ సిద్దిపేటకు తరలించకుండా చెరుకు ముత్యం రెడ్డి కొట్లాడిండు అని.. గతంలో కాంగ్రెస్(Congress) హయాంలోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని రేవంత్‌రెడ్డి అన్నారు. అలాగే కేంద్రం నుంచి నిధులు తెచ్చి రఘునందన్‌రావు దుబ్బాకను అభివృద్ధి చేస్తానని చెప్పి.. మూడేళ్లు గడిచినా.. ఇచ్చిన మాట నిలబెట్టుకోని ఆయనకు మళ్లీ ఓటు అడిగే హక్కు లేదని దుయ్యబట్టారు. ఈ ప్రాంతానికి రూ.10 వేల కోట్లు తెచ్చి అభివృద్ధి చేసి ఉంటే ఆయనకు ఆ హక్కు ఉండేదని చెప్పారు. పార్టీ రాజకీయ కుమ్ములాటల్లో బిజీగా ఉండు తప్ప.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
దొరల రాజ్యాన్ని గద్దె దింపాలి- ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలి: రేవంత్‌రెడ్డి
Telangana Elections 2023 : కొత్త ప్రభాకర్ రెడ్డి పేరులోనే కొత్త ఉంది తప్ప.. ఆయన పాత చింతకాయ పచ్చడే అంటూ రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. దొర గడీలో కాపలా ఉండే ప్రభాకర్.. ఎందుకు దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయలేదని ప్రశ్నించారు. అలాగే నిధులు ఎందుకు తెప్పించుకోలేకపోయారని.. పీజీ కాలేజీ ఎందుకు తీసుకురాలేకపోయారని రేవంత్ ప్రశ్నించారు. పదేళ్ల పాటు ఎంపీగా ఉన్న ప్రభాకర్‌రెడ్డి ఈ ప్రాంతానికి చేసిందేం లేదని మండిపడ్డారు. కేసీఆర్(KCR) గడిలో పెద్ద జీతగాడిలా.. బంట్రోతులా పని చేశారు తప్ప.. దుబ్బాక ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు.
Revanth Reddy Fires on BRS : ఈ పదేళ్లలో రఘునందన్, కొత్త ప్రభాకర్ రెడ్డిని చూశారు.. ఇక వాళ్లను చూడాల్సిందేమీ లేదు.. నీతికి, నిజాయతీకి మారుపేరు చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని దుబ్బాక ప్రజలను కోరారు. పదేళ్లలో కేసీఆర్ కుటుంబం బంగారుమయంగా మారింది తప్ప.. తెలంగాణను బొండాలగడ్డగా మార్చారని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ బక్కోడు కాదు.. బకాసురుడు.. ఫామ్‌హౌస్‌లో పడుకునే కుంభకర్ణుడు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు న్యాయం జరుగుతుందని.. ఆరు గ్యారెంటీ(Congress Six Guarentees)లు కచ్చితంగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం కట్టించడం ఖాయం.. దోచుకున్నది కక్కించడం ఖాయమని రేవంత్‌రెడ్డి తెలిపారు.
రాష్ట్ర శాసనసభ సమరంలో హోరాహోరీ - ప్రచారంతో కదం తొక్కిన బంధుజనం
కేసీఆర్‌ను ఓడిస్తేనే పేదలందరికి ఇళ్లు వస్తాయి : రేవంత్‌రెడ్డి