మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న చెక్‌డ్యాంలు నిండాయి. వరద ఉద్ధృతి పెరగ్గా పండివాగులోకి నీరు పారగా వాగు నిండుకుండను తలపిస్తోంది.
కొద్దిరోజులుగా కురుస్తున్న వానలకు చెరువులు, వాగులు నిండగా.. అడవుల్లోని వన్యప్రాణులకు తాగునీటి కష్టాలు తీరనున్నాయి. మోడుబారిన చెట్లు జీవం పోసుకుని పచ్చగా మారనున్నాయి. చాలా ఏళ్లకు వానలు కురవగా ఎండిపోయిన భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు, పట్టణవాసులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీచూడండి: ఇవాళ, రేపు భారీ వర్షాలు..19న మరో అల్పపీడనం