మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన రైతులు కిష్టాపూర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించారు. 48 గంటల్లో ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన అధికారులు 20 రోజులు గడిచినప్పటికీ డబ్బులు జమ చేయలేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రానున్న ఖరీఫ్ సీజన్‌కు 15 రోజుల సమయమే ఉండటం వల్ల పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే ఖాతాలలో డబ్బులు జమ చేయాలని కోరారు.
ఇవీ చూడండి: కళ్లముందే అన్యాయం.. రైతన్నల ఆగ్రహం..