మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఎర్రకుంట తండాలో ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. ప్రజాప్రతినిధులకు, అధికారులకు పలుమార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదు. తాజాగా పాఠశాలలు ప్రారంభం కావడం వల్ల ఇద్దరు ఉపాధ్యాయులు వచ్చి భయాందోళన చెందుతున్నారు.
పాఠశాలలో పెచ్చులూడిన గోడలు.. పైకప్పు నుంచి కారుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఉపాధ్యాయులు భయంతో సాయంత్రం వరకు గడిపారు. ఆ పాఠశాలలో గతంలో 35 మంది విద్యార్థులు ఉండేవారు. ఇప్పుడు ఆ పాఠశాలకు రావడానికి తాండావాసులు బయపడుతున్నారు.
ఇప్పటికైనా అధికారుల స్పందించి కొత్త పాఠశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని తాండావాసులు కోరుతున్నారు. ఆ విషయమై మండల వైద్యాధికారి బుచ్చనాయక్ను వివరణ కోరగా జిల్లా ఉన్నతాధికారులకు నివేదికలు పంపామని చెబుతున్నారు.
ఇదీ చూడండి : బాలుడు బలవన్మరణం.. గత నెలలో తండ్రి ఆత్మహత్య