మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట గ్రామస్థులందరూ కలసి ఓకే గణపతిని ఏర్పాటు చేసుకున్నారు. అదికూడ మట్టిగణపతిని ప్రతిష్ఠించారు. అధికారులు పర్యావరణహితం కోసం కృషి చేస్తున్నారు. ఈ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో పోలీసులు, అధికారులు సూచించిన నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయడం జరిగిందని పెద్ద చింతకుంట గ్రామ సర్పంచ్ శివకుమార్ తెలిపారు.
గ్రామంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో వినాయకుడి మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం వేళలో పూజలు చేస్తున్నారు. ఇప్పటి గ్రామచరిత్రలో ఓకే గణపతి విగ్రహం పెట్టడం మొదటిసారి అని గ్రామస్థులు పేర్కొన్నారు. కొవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ నిమజ్జనం చేస్తామని సర్పంచ్ వెల్లడించారు.
ఇదీ చూడండి: కూలిన ఐదంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది!