లాక్డౌన్ సమయంలో అక్రమంగా మద్యం తెచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరిని మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. మందుబాబుల బలహీనతను ఆసరాగా చేసుకుని మద్యం విక్రయిస్తున్న వారిపై నిఘా పెట్టిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పట్టణానికి చెందిన రఫీ, కుమార్ అక్రమంగా మద్యం తెచ్చి.. ఒక్కో బాటిల్‌పై రెండొందల వరకు ధరను పెంచి అమ్ముతున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 10 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు చేపడితే కఠన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: 'ఎవరూ ఈ విద్యా సంవత్సరం ఫీజులు పెంచొద్దు'