విద్యార్థులకు తొందరగా అర్థం అవ్వాలనే ఆలోచనతో మెదక్ జిల్లా జక్కపల్లి ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయురాలు విద్యార్థులతో బొమ్మల రామాయణం పుస్తకాన్ని తయారు చేశారు. పదో తరగతిలో రామాయణం పాఠంగా ఉంది. ఏటా సినిమా వేసి పిల్లలకు అర్థమయ్యేలా చూపించేవారిమని.. ఈసారి వినూత్నంగా చేసేందుకు ఇలా చేసినట్లు ఉపాధ్యాయురాలు పద్మ తెలిపారు.
ఓ చిత్రం ఎన్నో మాటలు మాట్లాడుతుందని విద్యార్థులకు నేర్పిస్తూ రామాయణంలోని ఒక్కో ఘట్టాన్ని ఒక్కో చిత్రంగా గీయమని చెప్పారు. ప్రిన్సిపల్ విజయలక్ష్మీ, తెలుగు ఉపాధ్యాయురాలు పద్మా సూచనలు పాటిస్తూ విద్యార్థులు పుస్తకాన్ని తయారు చేసినట్లు పిల్లలు తెలిపారు.
పుస్తకాన్ని బాలల వారోత్సవాల్లో భాగంగా ప్రధానోపాధ్యాయురాలు ఆవిష్కరించారు. బొమ్మల రామాయణాన్ని గ్రంథాలయంలో ఉంచుతామని భవిష్యత్తులో విద్యార్థులకు ఉపయోగపడుతుందని పద్మ తెలిపారు.
ఇదీ చూడండి : సామాన్యుడికి పామాయిల్ పోటు