మెదక్ జిల్లా శివ్వంపేట మండలం మీదుగా ఎంఎల్ఆర్ఐటీ ఛైర్మన్ మర్రి లక్ష్మారెడ్డి సైక్లింగ్ చేశారు. గత నాలుగేళ్ల క్రితం పదిహేను మందితో హైదరాబాద్ సైకిల్ క్లబ్ ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం క్లబ్లో 400 మంది సభ్యులున్నారన్నారు. ప్రతిరోజు సైకిల్ తొక్కితే.. ఆరోగ్యానికి మంచిదని.. పర్యావరణం కూడా బాగుంటుందని అయన అన్నారు. వారానికి రెండు రోజులు సైకిల్ సవారి చేస్తామని.. హైదరాబాద్, దుర్గం చెరువు, కొండపోచమ్మ సాగర్ వరకు సైక్లింగ్ చేస్తామని, ఒక్కోసారి హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు సైక్లింగ్ చేస్తామని ఆయన తెలిపారు.
అరవై సంవత్సరాల వయసులో వైద్యుల సలహా మేరకు సైకిల్ తొక్కడం ప్రారంభించి.. క్రమేణా అది అలవాటుగా మారిందని లక్ష్మారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు తనకు ఎలాంటి అనారోగ్యం లేదని.. సైక్లింగ్ చేయడం వల్లే పూర్తి ఆరోగ్యం ఉన్నానని ఆయన అన్నారు. ప్రస్తుతం తనకు 75 సంవత్సరాలు ఉంటాయని, తమ బృందంలో 70 ఏళ్లు మించిన వారు ఐదుగురు ఉన్నారని తెలిపారు. ఈ వారం యాభై మందితో సైక్లింగ్ నిర్వహిస్తున్నామన్నారు. దిల్లిలో వాతావరణ కాలుష్యం బాగా పెరిగిపోయిందని అన్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని పర్యావరణానికి కాపాడానికి తమవంతుగా వారంలో రెండురోజులు సైకిల్ సవారి చేపడుతున్నామని చెప్పారు. వీలైతే ప్రతి ఒక్కరు సైక్లింగ్ చేయాలన్నారు. యువకులు సైక్లింగ్‌పై దృష్టి సారించాలని.. తమ క్లబ్లో యువకులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: కరోనా పంజా: దేశంలో ఒక్కరోజే 90,632 కేసులు