ETV Bharat / state

టన్ను @ 1200..హైదరాబాద్ తర్వాత మెదక్​లోనే....! - mlc subhash reddy

ఇంటి నిర్మాణ ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇసుక, కంకర, సిమెంట్​ ధరలు ఆకాశానంటుతున్నాయి. సొంతిళ్లు కట్టుకోవాలనుకునే సగటు వ్యక్తి భయపడుతున్నాడు. వారికి ఉపశమనం కలిగించేలా టన్ను ఇసుక రూ.1200 కే అందిస్తామంటున్నారు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి.

http://10.10.50.85:6060//finalout4/telangana-nle/thumbnail/30-June-2019/3703034_215_3703034_1561861566974.png
author img

By

Published : Jun 30, 2019, 9:21 AM IST

నదులు, వాగుల్లో అనుమతి లేకుండా ఇసుక తవ్వకాలతో పర్యావరణం దెబ్బతినడమే కాకుండా భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని ఇసుక అవసరాలు ఎక్కువ ఉన్న చోట సబ్‌ స్టాక్‌ యార్డులను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నట్లు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. టన్ను ఇసుక రూ.1,200గా నిర్ణయించామని, అవసరం ఉన్న వారు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలని సూచించారు.

శనివారం ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెదక్‌లో ఏర్పాటు చేసిన ఇసుక విక్రయ కేంద్రాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వాల హయాంలో ఇసుక విక్రయాలతో రూ.10 కోట్ల ఆదాయం వచ్చేదని, తెరాస సర్కారు అధికారంలోకి వచ్చాక ఏటా రూ.2,600 కోట్ల ఆదాయం సమకూరుతోందన్నారు.

సొంత ఇంటి నిర్మాణాలు చేపట్టే వారికి వాగులో నుంచి ఇసుక తరలింపునకు అనుమతులు ఇవ్వాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆర్డీఓ సాయిరాంకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబ్‌ స్టాక్‌ యార్డు కార్యాలయాన్ని ప్రారంభించగా, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు విక్రయాలను మొదలుపెట్టారు.
కార్యక్రమంలో పురపాలిక అధ్యక్షుడు మల్లికార్జున్‌ గౌడ్‌, ఉపాధ్యక్షుడు అశోక్‌, జిల్లా పరిషత్తు ఉపాధ్యక్షురాలు లావణ్యరెడ్డి, కౌన్సిలర్లు శ్రీనివాస్‌, వెంకటరమణ, మల్లేశం, కో-ఆప్షన్‌ సభ్యులు గంగాధర్‌, ఖనిజాభివృద్ధి సంస్థ జీఎం దీప్తి, ప్రాజెక్టు అధికారి రామకృష్ణ, ఏడీ జయరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'మనసులో మాట'తో మళ్లీ వస్తున్న ప్రధాని మోదీ

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.