రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని చెడుగా చూపించే ప్రయత్నం చేస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. తద్వారా నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో లబ్ధిపొందాలని తెరాస ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. మెదక్ జిల్లా నర్సాపుర్ పట్టణ సమీపంలో టీరెడ్‌పోర్టు రెస్టారెంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో తనను గెలిపించిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. శాసన సభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు సభాపతికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నియోజవర్గం పరిధిలో తాను లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోసిన పంచాయతీరాజ్ ఎస్‌ఈ అధికారిపై ఫోన్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవిషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అణగారిన ప్రజల సమస్యల పరిష్కారం కోసం చివరివరకు పోరాడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ భాజపా ఇంఛార్జి సింగాయపల్లి గోపి, కౌన్సిలర్ సునీతా బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సాగర్ ఉపపోరు: నాలుగు రోజుల్లో 20మంది.. 23 నామినేషన్లు