ETV Bharat / state

పరిశుభ్రత కోసమే పల్లె, పట్టణ ప్రగతి: పద్మా దేవేందర్ రెడ్డి - మెదక్ జిల్లా లేటెస్ట్ న్యూస్

పరిశుభ్రత కోసమే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. మెదక్​ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు.

mla padma devender reddy stone few development works in medak
పరిశుభ్రత కోసమే పల్లె, పట్టణ ప్రగతి: పద్మా దేవేందర్ రెడ్డి
author img

By

Published : Dec 12, 2020, 1:09 PM IST

పల్లెలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. మెదక్ పట్టణంలో పలు వార్డుల్లో రూ.కోటి 28 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 70 ఏళ్ల నుంచి పల్లెలను ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు.

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం కోసమే డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు వంటి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని ఆమె తెలిపారు. పట్టణంలో ఇళ్ల స్థలాలు ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి అనుమతి ఇస్తామని... స్థలం లేని వారికి రెండు పడక గదుల ఇళ్లు కేటాయిస్తామన్నారు.

రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. అనంతరం సఖీ కేంద్రంలో రికార్డులను పరిశీలించారు. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్, వైస్ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, సిబ్బంది, కౌన్సిలర్లు, నాయకులు లింగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'ఊహించిన దాని కంటే వేగంగా ఆర్థికవ్యవస్థ రికవరీ'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.