మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మధన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఎల్లారెడ్డిగూడెం తండాలో కొత్తగా నిర్మించిన డంప్‌యార్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం వైకుంఠదామం పనులకు శంకుస్థాపన చేశారు.
తడిపోడి చెత్తను వేరుచేసి చెత్త సేకరణ సిబ్బందికి ఇవ్వాలని ప్రజలకు ఎమ్మెల్యే సూచించారు. పలుగ్రామాల ప్రజాప్రతినిధులు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకు రాగా... అన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తండాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. తాగునీటికి ఇబ్బందులు ఉన్నాయని తెలపగా... శాస్వత పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు.