ETV Bharat / state

ప్రతిపల్లెనూ అభివృద్ధి చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే మదన్​రెడ్డి - ఎమ్మెల్యే మదన్​రెడ్డి తాజా వార్తలు

మెదక్​ జిల్లా నర్సాపూర్​ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్​రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

mla Madan Reddy toured in Narsapur constituency
నర్సాపూర్​ నియోజకవర్గంలో పర్యటించిన మదన్​రెడ్డి
author img

By

Published : Jul 4, 2020, 2:14 PM IST

మెదక్​ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే మదన్​రెడ్డి పర్యటించారు. ముందుగా నర్సాపూర్​లో పర్యటించిన ఆయన.. పురపాలిక సాధారణ సమావేశంలో పాల్గొన్నారు. పట్టణంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.

అనంతరం నర్సాపూర్​ మండలం కాగజ్​మద్దూరులో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన డంపింగ్​యార్డును ప్రారంభించారు. ప్రాధాన్యత క్రమంలో అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేరుగా సేకరించాలని సూచించారు. పారిశుద్ధ్యంపై గ్రామస్థులకు మరింత అవగాహన కల్పించాలని తెలిపారు.

ఇదీచూడండి: అర్హులైన రైతులందరికీ రైతుబంధు సొమ్ము: నిరంజన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.