మెదక్ జిల్లా నర్సాపూర్, కౌడిపల్లి మండలాల్లో కల్యాణలక్ష్మి, షాదిముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం నర్సాపూర్ మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలు తమ సమస్యలను మంత్రికి తెలిపారు. సమస్యలపై చర్చించిన ఎమ్మెల్యే పరిష్కారం దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పేదలను ఆదుకోవాలని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీవో మార్టిన్ లూథర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పసికందు దేహంతో పీఎస్‌కు మహిళ.. భర్తపై ఫిర్యాదు