ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని అప్పాజిపల్లి, చిన్న ఘనపూర్‌లో కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలో రైతులపై కేసు, సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఏఈఓను పోలీసులు కొట్టడం వంటి ఘటనలు దురదృష్టకరమన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామన్నారు.
రైతులు పండించిన ధాన్యాన్ని సజావుగా కొనుగోలు చేసేలా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసిందని మంత్రి వివరించారు. అనంతరం మెదక్ కలెక్టరేట్లో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ధర్మారెడ్డి, అదనపు కలెక్టర్ నగేశ్, జిల్లా వ్యవసాయ అధికారి పరుశురాం, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 20 రోజుల్లోనే.. 1500 పడకలతో టిమ్స్ ఏర్పాటు: కేటీఆర్