మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి గోదావరి జలాలతో శాశ్వత తాగునీటి సమస్యను పరిష్కరించనున్నట్టు మంత్రి హరీష్‌రావు తెలిపారు. శివ్వంపేటలో గోదావరి జలాలు సరఫరా కోసం నిర్మాణం చేస్తున్న సంపును పరిశీలించారు. ప్రస్తుతం కోమటిబండ నుండి సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో మల్లన్నసాగర్ నుంచి నీటిని సరఫరా చేయనున్నట్లు చెప్పారు. నర్సాపూర్, పటాన్‌చెరు నియోజవర్గాల పరిధిలోని 511 గ్రామాలకు జులై 10లోగా అందించనున్నట్టు వెల్లడించారు.
వేసవిలో అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ... కరోనా వల్ల పనులు కాస్త ఆలస్యం అయ్యాయని మంత్రి అన్నారు. ప్రత్యేకంగా పైపులైన్ పనుల కోసం రూ. 30 కోట్లు నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. అటవీశాఖ నుంచి అనుమతులు వచ్చినందున... పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ హేమలత, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీమంత్రి సునీతారెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మంత్రి జగదీశ్‌రెడ్డి వర్సెస్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి