ETV Bharat / state

మెదక్​ కలెక్టరేట్​లో అధికారులతో మంత్రి హరీశ్​రావు సమీక్ష - మెదక్​ కలెక్టరేట్​లో మంత్రి హరీశ్​రావు సమీక్ష​

జిల్లాలో ధాన్యం కేంద్రాల ఏర్పాటు, కరోనా కట్టడి చర్యలపై మెదక్​ కలెక్టరేట్​లో అధికారులతో మంత్రి హరీశ్​రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. యాసంగి పంటకు సంబంధించి కోత యంత్రాల కల్పన, గన్నీబ్యాగులు వివరాలు, ఉపాధి హామీ అమలు... కరోనా కట్టడిలో భాగంగా రసాయనాల స్ప్రే తదితర అంశాలపై చర్చించారు.

minister harish rao review meeting in medak collectorate
మెదక్​ కలెక్టరేట్​లో అధికారులతో మంత్రి హరీశ్​రావు సమీక్ష
author img

By

Published : Apr 4, 2020, 5:08 PM IST

వరి పంటకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీశ్​రావు అధికారులకు ఆదేశించారు. మెదక్​ జిల్లా కలెక్టరేట్​లో పలు అంశాలపై జిల్లా అధికారులతో మంత్రి సమీక్షించారు. వరి కోతకు ఇబ్బంది లేకుండా 350 కోత యంత్రాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలుకు సరిపడ గన్ని బ్యాగులు, ఇతర సామాగ్రి సిద్ధం చేసుకోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో పాత పద్ధతిలో కాకుండా ఈసారి టోకెన్ జారీ చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. కనీస ప్రమాణాలు లేని ధాన్యాన్ని కొనుగోలు చేయొద్దని... చిన్న, సన్నకారు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. జిల్లాలో 45 మక్కల కొనుగోలు కేంద్రాలు, 285 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ధరలపై దృష్టి పెట్టండి

లాక్​డౌన్​ సందర్భంగా నిత్యావసర సరకుల ధరలు పెరగకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు. సిద్ధంగా ఉన్న పంటలను మార్కెట్​కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రసాయనాలు స్ప్రే చేయించాలని... పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని ఆదేశించారు.

ఐసోలేషన్​ వార్డు పరిశీలన

అనంతరం మెదక్ ప్రాంతీయ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డును పరిశీలించారు. ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించి కార్యక్రమం అమలుపై డీలర్లు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో మంత్రి వెంట కలెక్టర్​ ధర్మారెడ్డి, అదనపు కలెక్టర్​ నాగేష్​, ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్ రెడ్డి, రామలింగారెడ్డి, కలెక్టర్ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మెదక్​ కలెక్టరేట్​లో అధికారులతో మంత్రి హరీశ్​రావు సమీక్ష

ఇదీ చూడండి: 'మోదీ చెప్పినట్లు లైట్లు ఆర్పితే దేశం అంధకారమే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.