ETV Bharat / state

మార్చి నెలాఖరుకు ఇంటింటికీ నీళ్లందించాలి : హరీశ్​రావు - మిషన్​ భగీరథ పనులపై హరీశ్​రావు సమీక్ష

మిషన్ భగీరథ పనులను పూర్తి చేసి మార్చి నెలాఖరు నాటికి ఇంటింటికీ నీళ్లందించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. మెదక్ పురపాలికలో జరుగుతున్న పనులపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

minister harish rao meeting on mission bhageeratha works with officers  in medak dist
అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి హరీశ్​రావు
author img

By

Published : Jan 20, 2021, 10:29 PM IST

మెదక్​ పురపాలికలో మిషన్ భగీరథ ద్వారా మార్చి నెలాఖరు నాటికి ఇంటింటికి నీరందించాలని రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి హరీశ్​రావు అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్​లో మిషన్​ భగీరథ పనులపై సమీక్ష నిర్వహించారు. పట్టణంలో 32 కిలోమీటర్ల మేర పైపులైన్​ వేయాల్సి ఉండగా ఇప్పటిదాకా 11 కిలో మీటర్ల మేర మాత్రమే పూర్తి చేశారని తెలిపారు. బ్లూ పైపులైను సరఫరాకు అనుగుణంగా నీటి కుళాయిలు బిగించాలని అధికారులకు సూచించారు.

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లకు కూడా పైపులైన్​ వేయాలని అధికారులకు సూచించారు. పనులు వేగవంతం చేయడానికి పురపాలికను ఆరు జోన్లుగా విభజించి ఆరు మంది ప్రత్యేక అధికారులతో పాటు 32 వార్డులకు వీఆర్వోలను నియమించామని తెలిపారు. వార్డు కౌన్సిలర్ల సహకారంతో వేసవిలోగా తాగునీరు అందించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో స్థానిక శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి, మున్సిపల్​ ఛైర్మన్ చంద్రపాల్, ఇన్​ఛార్జ్​ జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, ఇంజనీరింగ్, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : కేసీఆర్‌ను జైళ్లో పెట్టే దమ్ము భాజపాకు ఉందా: పట్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.