ETV Bharat / state

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కుల పంపిణీ

author img

By

Published : Jan 9, 2021, 11:00 PM IST

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీశ్​రావు సూచించారు. మెదక్ జిల్లాలోని పలువురు లబ్ధిదారులకు ఆయన చెక్కులను అందజేశారు.

minister harish rao distributed kalyana laxmi cheques in medak district
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

మెదక్​ జిల్లాలోని పలు గ్రామాల్లో మంత్రి హరీశ్​రావు సుడిగాలి పర్యటన చేశారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే మెదక్ మండలానికి చెందిన 80 మంది, హవేలీ ఘన్​పూర్​కు చెందిన 99 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులను అందజేశారు.

అనంతరం పట్టణంలో రూ.5.5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సింథటిక్ ట్రాక్​ను మంత్రి పరిశీలించారు. పలు అభివృద్ధి పనుల కోసం తక్షణ సహాయంగా రూ.25 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా పట్టణంలో రూ.2 కోట్లతో ఫుట్​బాల్ కోర్టు ఏర్పాటు, మరో రూ. 70 లక్షలు మౌళిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా మంత్రి సూచించారు.

ఇదీ చూడండి: రైతుబంధు పథకానికి మరో 208 కోట్లు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.