గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సర్పంచ్‌లు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. మెదక్‌లో జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని మండలాల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు సమావేశమయ్యారు.
వీధి దీపాల నిర్వహణను ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు అంగీకరించినట్టు గ్రామ పంచాయతీ తీర్మానాలు అందజేయాలని ఒత్తిడి తెస్తున్నట్టు అధ్యక్షులు తెలిపారు. ఈ విధానం సరైంది కాదని, దీనిని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేశారు. దశల వారీగా ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వాలని ఈ సమావేశంలో తీర్మానించారు.
ఇదీ చదవండి: ఆ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు