ETV Bharat / state

మెదక్ నూతన కలెక్టర్​గా హనుమంతరావు బాధ్యతలు

మెదక్​ కలెక్టర్​గా హనుమంతరావు బాధ్యతలు స్వీకరించారు. ఏడుపాయల వనదుర్గా మాతను దర్శించుకున్న అనంతరం కలెక్టరేట్​లో పాలనాధికారిగా బాధ్యతలు చేపట్టారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

medak district new collector hanmantha rao
మెదక్ నూతన కలెక్టర్​గా హనుమంతరావు బాధ్యతలు
author img

By

Published : Oct 26, 2020, 2:38 PM IST

రైతులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మెదక్ జిల్లా నూతన కలెక్టర్ హనుమంతరావు హామీ ఇచ్చారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకొని అనంతరం కలెక్టరేట్​లో పాలనాధికారిగా బాధ్యతలు చేపట్టారు. చాలామంది రైతులు ధాన్యాన్ని రోడ్లమీద పోశారని... జిల్లాలో 76 రైతు వేడుకలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు.

రైతు వేదికలను త్వరితగతిన పూర్తి చేసి... అన్నదాతలకు అందుబాటులో ఉంచుతామన్నారు. జిల్లాలో పల్లె ప్రకృతి వనాల నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట, నార్సింగి మండలాల్లో ఉప ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని అన్నారు. జిల్లా ప్రజలపై అమ్మవారి కటాక్షాలు ఉండాలని ఆయన కోరినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: వర్ణశోభిత గాజుల్లో ఏడుపాయల వనదుర్గా దేవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.