ETV Bharat / state

రైస్​ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్​

మెదక్​ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని రైస్​ మిల్లులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. లారీల కొరతను దృష్టిలో ఉంచుకుని రహదారులపై ఖాళీగా వెళ్తోన్న లారీలను నిలిపి సమీప కొనుగోలు కేంద్రాలకు తరలించేలా చూడాలని అధికారులు, తహసీల్దార్​లకు సూచించారు.

medak district collector
medak district collector
author img

By

Published : May 11, 2021, 5:22 PM IST

కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలించడంలో ఎదురవుతున్న లారీల కొరతను దృష్టిలో ఉంచుకుని రహదారులపై ఖాళీగా వెళ్తున్న లారీలను వినియోగించుకోవాలని అధికారులకు మెదక్​ జిల్లా కలెక్టర్ సూచించారు. అదనపు కలెక్టర్ రమేశ్​తో కలిసి... నార్సింగి మండల కేంద్రంలోని రైస్​ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

హమాలీల, లారీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ధాన్యం తూకం వేసి.. మిల్లులకు తరలించి అక్కడ దించుకునే వరకు నిరీక్షంచవల్సి వస్తుందని అన్నారు. కాబట్టి మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని 12 గంటల్లోగా దించుకుని ఏ కేంద్రం నుంచి వచ్చిందో లారీ అదే కేంద్రానికి తిరిగి వెళ్లేలా చూడాలని కోరారు.

ఇదీ చూడండి: రేపట్నుంచి 10 రోజులపాటు రాష్ట్రంలో లాక్‌డౌన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.