ETV Bharat / state

వలస కార్మికులకు ఆహారం, పాదరక్షల పంపిణీ - వలస కార్మికులకు ఆహారం, పాదరక్షల పంపిణీ

ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి లాక్​డౌన్ సమయంలో కాలినడకను ఇళ్లకు బయలుదేరిన వలస కార్మికులకు మెదక్ జిల్లా కలెక్టర్ ఆహారం ప్యాకెట్లను, పాదరక్షలను అందజేశారు. లాక్​డౌన్ పూర్తయ్యే వరకూ ఎవరూ ఇళ్లలోంచి బయటకు రాకూడదని సూచించారు.

medak collector distributed food and foot wear
వలస కార్మికులకు ఆహారం, పాదరక్షల పంపిణీ
author img

By

Published : May 2, 2020, 9:57 PM IST

మెదక్ జిల్లా చేగుంటలో జాతీయ రహదారి వెంట సొంత రాష్ట్రాలకు తరలిపోతున్న వలస కార్మికులకు ఆహారం ప్యాకెట్లతో పాటు పాదరక్షలు అందజేశారు జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి. ఈ కార్యక్రమంలో కలెక్టర్​తో పాటు ఎమ్మార్వో విజయలక్ష్మీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

లాక్​డౌన్ కారణంగా వందల కిలోమీటర్లు నడిచి వెళ్తున్న వారి ఆకలి తీర్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. లాక్​డౌ పూర్తయ్యేవరకు ఎవరూ ఇంట్లోంచి బయటకు రాకూడదని తెలిపారు. అత్యవసర సమయాల్లో బయటకు వచ్చినవారు తప్పకుండా మాస్కులు ధరించాలని సూచించారు.

ఇవీ చూడండి: కాలిబాటపై మృతదేహం... తండ్రి కోసం పిల్లల ఆరాటం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.