ETV Bharat / state

'అభివృద్ధిలో మెదక్ ఎప్పుడూ ముందే ఉండాలి' - 'అభివృద్ధిలో ఎప్పుడూ మెదక్​యే ముందుండాలి'

మెదక్​ జిల్లా అన్ని విషయాల్లో అభివృద్ధి చేయాలనేదే తమ లక్ష్యమని కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. అందులో భాగంగానే గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు ఎక్కడి వరకు వచ్చాయో తెలుసుకునేందుకు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

medak collector dharmareddy teliconference
'అభివృద్ధిలో ఎప్పుడూ మెదక్​యే ముందుండాలి'
author img

By

Published : Jul 25, 2020, 10:19 AM IST

మెదక్​ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి జిల్లాలో డీఎల్​పీఓ, ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ సెక్రటరీలతో టెలీకాన్ఫరెన్​ నిర్వహించారు. జిల్లాలోని ఆయా గ్రామాల్లో శ్మశానవాటికలు, రైతువేదికలు, రైతు కల్లాలు, డంపుయార్డుల నిర్మాణాలు ఏఏ స్థాయిలో ఉన్నాయనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పనుల విషయంలో అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పనులు వేగంగా పూర్తి చేయడమే కాకుండా వాటిలో నాణ్యత లోపించకుండా చూసే బాధ్యత కూడా అధికారులదేనని కలెక్టర్ తెలిపారు. ఈ వర్షాకాలంలో దోమలు ఎక్కువగా వచ్చి సీజనల్​ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున శుక్రవారాన్ని డ్రై డేగా పాటించాలని కోరారు. అన్ని విషయాల్లోనూ మెదక్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిచేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.