ETV Bharat / state

'ఆన్​లైన్​ విద్యాబోధనకు కేబుల్​ ఆపరేటర్లు సహకరించాలి' - డిజిటల్​ తరగతులు

విద్యార్థులకు ఆన్​లైన్​ విద్యాబోధన నేపథ్యంలో మెదక్​ జిల్లా అదనపు కలెక్టర్​ జిల్లాలోని కేబుల్​ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఆన్​లైన్​ విద్యాబోధనకు కేబుల్​ ఆపరేటర్లు తప్పకుండా సహకరించాలని కోరారు.

medak additional collector meeting with cable operators
'ఆన్​లైన్​ విద్యాబోధనకు కేబుల్​ ఆపరేటర్లు సహకరించాలి'
author img

By

Published : Sep 1, 2020, 11:37 AM IST

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఆన్​లైన్​ విద్యాబోధనకు కేబుల్ ఆపరేటర్లు తప్పకుండా సహకరించాలని... ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్​లోని ప్రజావాణి హాల్​లో జిల్లాలోని ఆయా మండలాల కేబుల్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు.

కొవిడ్–19 నేపథ్యంలో మూడో తరగతి నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్​ విద్యార్థులకు దూరదర్శన్ యాదగిరి, టీ–శాట్ ఛానెళ్లలో బోధించనున్నారని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని కేబుల్ ఆపరేటర్లందరూ దూరదర్శన్ యాదగిరి, టీ–శాట్ ఛానెళ్ల ను తప్పని సరిగా ప్రసారం చేయాలని అడిషనల్ కలెక్టర్ నగేష్ ఆదేశించారు.

పేద విద్యార్థులు, ప్రజా సేవ కోసం కేబుల్ టీవీ ఆపరేటర్లు ప్రధాన పాత్ర పోషించాలని అన్నారు. ఆన్​లైన్​ పాఠాలను పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు కూడా చూసేందుకు కేబుల్ ఆపరేటర్లు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

దీంతో పాటు కరెంట్ సరఫరా, పంచాయతీల్లో విద్యార్థులకు సహకారం అందించేలా సూచనలు చేయాలన్నారు. ఈ విషయంలో కేబుల్ ఆపరేటర్లకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రమేష్​ కుమార్​, కేబుల్ ఆపరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: కేంద్రం పూర్తి పరిహారం ఇవ్వాల్సిందే : మంత్రి హరీశ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.