మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలోని ఏడుపాయల పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మాఘ అమావాస్యను పురస్కరించుకుని దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు.
రాష్ట్ర నలుమూలల నుంచే కాక మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఏడుపాయల క్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ కృష్ణమూర్తి పర్యవేక్షణలో 140 మంది పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
- ఇదీ చూడండి : 'అమీన్పూర్ అత్యాచారం ఘటన అంతా కట్టుకథే'