ETV Bharat / state

ఆటోవాలా..కరాటే ఛాంపియన్​

ఓవైపు ఆటో నడుపుతూ..మరోవైపు కరాటేలో సత్తా చాటుతున్నాడో యువకుడు. మెదక్​ జిల్లా జుక్కల్ గ్రామానికి అతను అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు పొందుతున్నాడు. .

author img

By

Published : May 19, 2019, 6:33 PM IST

ఆటోవాలా..కరాటే ఛాంపియన్​

మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండలం జుక్కల్​ గ్రామానికి చెందిన పరశురామ్ ఆటో నడుపుకుంటూ కరాటేలో అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు సాధించాడు. బాలయ్య, మణెమ్మ దంపతులకు పరిశురాం ఒక్కడే సంతానం. ఆరేళ్ళ వయస్సులోనే తండ్రిని కోల్పోయాడు. రెండెకరాల పొలంలో తల్లి వ్యవసాయం చేసి పరశురాంను ఇంటర్ వరకు చదివించింది. కుటుంబ పోషణకై మెదక్ పట్టణానికి ఆటో కిరాయికి వెళ్తూ అక్కడ కరాటే మాస్టర్ నగేశ్​తో పరిచయం ఏర్పడింది. ఆటో నడుపుతూనే కరాటే క్లాసులకు వెళ్లాడు. అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు పొందాడు. ఈ క్రీడను ఇతరులకు సైతం నేర్పాలనే ఉద్దేశంతో గ్రామానికి చెందిన చిన్న పిల్లలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు.

ఆటోవాలా..కరాటే ఛాంపియన్​

ఇవీ చూడండి: వికటించిన పెళ్లి భోజనం..30మందికి అస్వస్థత

Intro:TG_SRD_36_19_karate_lo_auto_wala_pratibha_avb_g6
ప్రతిభకు పేదరికం అడ్డుకాదని...ఆసక్తి ఉంటే ఇష్టమైన రంగంలో రణించవచ్చని... శ్రమను నమ్ముకుంటే లక్ష్యం నెరవేరుతుందని నినాదంతో మారుమూల ప్రాంతం యువకుడు ముందుకు సాగుతున్నాడు. విజయాలను అందుకుని తానేమిటో నిరూపించుకునెందుకు ఆటో నడుపుతూ మరో వైపు కరాటే నేర్చుకున్నాడు. సంగారెడ్డి ఉమ్మడి జిల్లా పెద్దశంకరంపేట మండలం జుక్కల్ గ్రామానికి చెందిన పరశురామ్ విజయ గాథ ఇది. గ్రామానికి చెందిన బాలయ్య, మణెమ్మ దంపతులకు పరిశురాం ఒక్కడే సంతానం. ఆయన ఆరేళ్ళ చిన్న వయస్సు ఉన్నప్పుడే అతని తండ్రి మృతి చెందారు. దీంతో వారికి ఉన్న రెండెకరాల పొలం లో వ్యవసాయం చేసుకుంటూ ఆమె ఇంటర్ వరకు చదివించింది. శంకరం పేటలోని డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం వరకు చదివి కుటుంబ పోషణ నిమిత్తం ఆటో డ్రైవింగ్ నేర్చుకుని సొంత ఆటో తీసుకుని జీవనం సాగిస్తున్నాడు. మెదక్ పట్టణానికి ఆటో కిరాయి వెళ్తూ అక్కడ కరాటే మాస్టర్ నగేష్తో ఏర్పడిన పరిచయం అతనికి కరాటే పై ఆసక్తిని పెంచింది . ఇలాగైనా కరాటే విద్య నేర్చుకోవాలని ఆయన తపనతో పట్టుదలతో మాస్టర్ ను కరాటే నేర్పాలని అడిగాడు. కరాటే మాస్టర్ నగేష్ అతనికి ఉదయం త్వరగా రావాలని కరాటే నేర్పడానికి ఒప్పుకున్నాడు. దీంతో నిత్యం ఉదయం కరాటే క్లాసులకు వెళ్తూ దినమంతా ఆటో నడుపుకునే వాడు. 2011లో కరాటే చేరిన ఆయన ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు పొందాడు. ఈ క్రీడను ఇతరులకు సైతం నేర్పాలని ఉద్దేశంతో గ్రామానికి చెందిన చిన్న పిల్లలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు. గ్రామంలో అందరూ ఎంతో ఆప్యాయతగా చూసుకుంటాడు. ఆత్మరక్షణ కోసం ఎంతో ఉపయోగపడుతుందని నేర్చుకోవాలని ఆయన అంటున్నారు

Body:TG_SRD_36_19_karate_lo_auto_wala_pratibha_avb_g6

Conclusion:TG_SRD_36_19_karate_lo_auto_wala_pratibha_avb_g6
9440880861
kit no. 742
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.