ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్​రెడ్డి

మెదక్​ జిల్లా నర్సాపూర్​లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మదన్​రెడ్డి ప్రారంభించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం సూచనల మేరకు భౌతికదూరం పాటిస్తూ కేంద్రాల్లో విక్రయాలు జరపాలని ఆయన తెలిపారు.

grain purchasing centers are opened by the mla madan reddy in narsapur medak
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్​రెడ్డి
author img

By

Published : Apr 9, 2020, 12:43 PM IST

రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తెలిపారు. శివ్వంపేటలో మొక్కజొన్న, వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. రైతులు భౌతికదూరం పాటిస్తూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ సూచనలు పాటిస్తూ విక్రయాలను జరపాలన్నారు. కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం తిమ్మాపూర్‌ గ్రామంలో కల్లూరి హన్మంతరావు ట్రస్టు ద్వారా గ్రామస్థులకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. దాతలు ఇలా ముందుకు వచ్చి ఆదుకోవడాన్ని ఆయన అభినందించారు.

ఇవీచూడండి: కోయలేక.. కోసినా అమ్మలేక.. చ'మిర్చి'న రైతు కళ్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.