ETV Bharat / state

హరితహారానికి సర్వం సన్నద్ధం

తరువులే జీవకోటికి ఆధారం. పచ్చదనం పెంపు భావి తరాలకు భరోసా. పల్లెలను హరితవనాలుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొక్కలు విరివిగా పెంచేందుకు హరితహారం కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రతి ఇంటా పండ్ల మొక్కలు పెంచేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో జూన్‌ 20 నుంచి హరితహారం ఆరో విడత ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ ఇటీవల అధికారులను ఆదేశించారు. దీంతో మెదక్​ జిల్లాలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

medak district latest news
medak district latest news
author img

By

Published : May 24, 2020, 9:25 AM IST

రానున్న వానాకాలంలో నాటే మొక్కల పెంపకంపై మెదక్​ జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టింది. వన నర్సరీల్లో మొక్కల సంరక్షణకు హరిత పందిళ్లను సైతం పంపిణీ చేసింది. మార్చి 23 నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి రావడం వల్ల మొదట్లో కూలీలు పనులు చేయడానికి ఆసక్తి చూపలేదు. అధికారులు అవగాహన కల్పించడంతో నెల రోజులుగా భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి పనులు చేస్తున్నారు.

జిల్లాలో 469 నర్సరీలు...

గ్రామ పంచాయతీకో నర్సరీ చొప్పున జిల్లాలో 469 నర్సరీలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అన్ని గ్రామాల పరిధిలో 37.38 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ మేరకు మండలాల వారీగా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అటవీ భూముల్లో 5 లక్షల మొక్కలు నాటడానికి ఆ శాఖ ఆధ్వర్యంలో 12 నర్సరీలు ఏర్పాటు చేశారు.

ప్రతి నర్సరీలో గ్రామ లక్ష్యాన్ని బట్టి 20 వేల నుంచి 40 వేల వరకు మెుక్కలు సంరక్షణలో ఉన్నాయి. ఇప్పటి వరకు నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో అటవీ, ఉపాధి హామీ శాఖల ఆధ్వర్యంలో మొక్కలను పెంచారు. పల్లె ప్రగతి సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ బాధ్యతను గ్రామపంచాయతీలకు అప్పగించారు. అందులో భాగంగానే మొదటి, రెండో విడత పల్లె ప్రగతిలో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు పెంచే ప్రక్రియ ప్రారంభించారు. పంచాయతీల పరిధిలోని ఖాళీ స్థలాలు, రహదారులకు ఇరువైపులా నాటించారు.

ప్రతి గ్రామ పంచాయతీ లక్ష్యం 40 వేల మొక్కలు...

గతంలో ప్రతి గ్రామ పంచాయతీ 40 వేల మొక్కలు నాటి సంరక్షించాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. ఇలా నాటిన వాటిలో 70 నుంచి 80 శాతం సంరక్షణ లేక ఎండిపోయాయి. లక్ష్యం భారీగా ఉన్నప్పటికీ ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఈ విషయం గుర్తించిన అధికారులు మొక్కల సంరక్షణ పూర్తి బాధ్యతలను సర్పంచులు, కార్యదర్శులకు అప్పగించారు. అన్ని పంచాయతీలకు ట్రాక్టర్లు అందుబాటులో ఉండటం వల్ల ట్యాంకర్ల ద్వారా నీటి తడులు అందిస్తున్నారు. దీంతో ఐదో విడత హరితహారంలో నాటిన మొక్కల సరరక్షణ మెరుగుపడింది.

హరిత పందిళ్లతో రక్ష...

ప్రస్తుతం నర్సరీల్లోని మొక్కలు ఎండిపోకుండా హరిత పందిళ్లను అధికారులు గ్రామాలకు పంపిణీ చేశారు. వాటి ద్వారా మొక్కలను కాపాడుకోవడానికి ఆస్కారం కలిగింది. ఈసారి నర్సరీల్లో అధికారులు కొన్ని కొత్త మొక్కలను పెంచుతున్నారు. శ్రీగంధం, ఎర్రచందనం, నెమలినాద, బాదం, చీమచింత, నీలగిరి, జామ, జువ్వి, పారిజాతం తదితరాలను సిద్ధం చేస్తున్నారు. పల్లెలు, పట్టణాల్లో దోమల ఉద్ధృతి అధికంగా ఉంది. వాటి నుంచి ఉపశమనం పొందడానికి కృష్ణ తులసి మొక్కలను సైతం అందుబాటులో ఉంచారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.