మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. సేఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెగా హెల్త్ క్యాంపు రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేతో కేక్ కట్ చేపించి.. సంబురాలు జరుపుకున్నారు.
ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. కాళేశ్వరం జలాలు అందుబాటులోకి వస్తే జిల్లా సస్యశ్యామలం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ చంద్రబాల్, వైస్ ఛైర్మన్ మల్లికార్జున్, కౌన్సిలర్లు, ఎంపీపీ, జడ్పీటీసీ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సీతరామతో భూములు సస్యశ్యామలం: రాములు నాయక్