మెదక్ మార్కెట్ యార్డ్లో ఉన్న వరిధాన్యాన్ని అక్కడే కొనుగోలు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో ధాన్యం ఆరబెట్టడానికి స్థలం లేకపోవడం వల్ల నవాబుపేట, గోల్కొండ ప్రాంతాలకు చెందిన దాదాపుగా 200 మంది రైతులు తమ ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబోశారన్నారు.
ఇప్పుడు మార్కెట్ నుంచి మరో ప్రాంతానికి ధాన్యాన్ని తరలిస్తేనే కొనుగోలు చేస్తామని పీఏసీఎస్ పాలకవర్గం చెప్పడం సరికాదని తెలిపారు. దీనివల్ల రవాణాకు ఖర్చులు ఎక్కువవుతాయని ఇప్పటికే నష్టపోయి ఉన్న తమకు అధిక భారం అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల యార్డులో ఆరబోసిన ధాన్యాన్ని అక్కడే తూకం వేసి కొనుగోలు చేయాలని కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: తూకాలను జాప్యం చేయకూడదు: మంత్రి ఈటల