మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో సైకిల్ దొంగతనం చేశాడని నాగరాజు అనే వ్యక్తిని స్థానికులు తీవ్రంగా కొట్టి.. పంచాయతీ సిబ్బందికి అప్పగించారు. అస్వస్థతకు గురైన నాగరాజు ఇంటికి వచ్చి అలాగే పడుకొన్నాడు. ఉదయం భార్య నిద్ర లేపగా అప్పటికే మృతి చెందాడు. సమాచారమందుకున్న తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని కొట్టిన వారిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడి స్వస్థలం కామారెడ్డి జిల్లా లింగపేట మండలం ఐలాపూర్. బతుకు దెరువు కోసం కాళ్లకల్ వచ్చి జీవిస్తున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.మృతుడిని కొట్టిన దృశ్యాలు బయటక వచ్చాయి. అందులో నాగరాజును కొందరు చితకబాదారు.
ఇదీ చూడండి: యూరియా కొరతపై ప్రతిపక్షాల రాద్దాంతం సరికాదు: మంత్రి నిరంజన్ రెడ్డి