ETV Bharat / state

ఉన్నతాధికారుల కొరతతో స్తంభించిన పరిపాలన - మెదక్​ జిల్లా తాజా వార్తలు

అధికారుల కొరత ప్రజల పాలిట శాపంగా మారింది. అవసరాల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే వారికి నిరాశే ఎదురవుతోంది. కొత్త మెదక్​ జిల్లాలో 15 ప్రభుత్వ శాఖలకు జిల్లా స్థాయి అధికారులు లేరు. ఉన్నతాధికారులు ఇతర శాఖల అధికారులకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. సదరు అధికారులపై పని ఒత్తిడి పెరిగి అటు సొంత శాఖకు, ఇటు అదనంగా ఉన్న శాఖకు న్యాయం చేయలేకపోతున్నారు.

administration froze with a shortage of superiors in medak district
ఉన్నతాధికారుల కొరతతో జిల్లాలో స్తంభించిన పరిపాలన
author img

By

Published : Jan 15, 2021, 12:38 PM IST

Updated : Jan 15, 2021, 2:37 PM IST

*పాలనాధికారిగా పనిచేసిన ధర్మారెడ్డి ఉద్యోగ విరమణ చేసి ఐదు నెలలు పూర్తయ్యాయి. ఆ తర్వాత ఆయన స్థానంలో సిద్దిపేట పాలనాధికారి వెంకటరామరెడ్డికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో మెదక్‌ జిల్లా పాలనాధికారిగా సంగారెడ్డి జిల్లా పాలనాధికారి హనుమంతరావును నియమించారు. ఎన్నికల అనంతరం తిరిగి వెంకటరామరెడ్డికే బాధ్యత అప్పగించగా ప్రస్తుతం ఆయనే కొనసాగుతున్నారు.

* పాలనాధికారి తర్వాత కీలక స్థానం అదనపు పాలనాధికారి. జేసీగా కొనసాగిన నగేశ్‌కు అదనపు పాలనాధికారిగా పదోన్నతి కల్పించగా లంచం కేసులో గతేడాది సెప్టెంబర్‌లో అనిశా ఆయన్ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు.

* 15 ప్రభుత్వ శాఖలకు జిల్లా స్థాయి అధికారులే లేరు. దీంతో ఇతర శాఖల అధికారులకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. సదరు అధికారులపై పని ఒత్తిడి పెరిగి అటు సొంత శాఖకు, అదనంగా ఉన్న శాఖకు న్యాయం చేయలేక పోతున్నారు.

ఇదీ మెతుకు సీమలో ప్రభుత్వ పాలన తీరు. పాలన ప్రజల దరి చేరేందుకు ఏర్పాటైన కొత్త జిల్లాల్లో కీలకమైన ఇద్దరు జిల్లా ఉన్నతాధికారులు లేకపోవడం, మరో వైపు పలు శాఖలకు ఇన్‌ఛార్జిలు కొనసాగడంతో పాలనపై ప్రభావం పడుతోంది. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు అంతంత మాత్రంగానే ఉంటోంది. అభివృద్ధి పనులపై తూతుమంత్రంగా సమీక్షలు తప్ఫ..క్షేత్రస్థాయిలో ఏ మేరకు పూర్తయ్యాయనేది ఎవరూ చూడటం లేదు. నిధుల వినియోగంతో ముడిపడి ఉన్న పనులకు పాలనాధికారి అనుమతి పొందాల్సి ఉండగా, రెగ్యులర్‌ పాలనాధికారి లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరో వైపు ప్రతి చిన్న పనికి, దస్త్రాలపై సంతకాలకు ఇన్‌ఛార్జి పాలనాధికారి ఆమోదానికి సుదూరం వెళ్లాల్సి వస్తోందని అధికారులు, ఆయా శాఖల సిబ్బంది వాపోతున్నారు. ఇద్దరు కీలక అధికారుల భర్తీతో పాటు, ఇతర శాఖల్లో అధికారులను నియమిస్తే పాలన గాడిలో పడనుంది. ఈ అంశంపై ఈటీవీభారత్ కథనం.

పాలనా సౌలభ్యానికి తెరాస ప్రభుత్వం 2016లో జిల్లాల పునర్విభజన చేపట్టింది. మెదక్‌ పట్టణం కేంద్రంగా ఇరవై మండలాలతో జిల్లా ఏర్పడింది. జిల్లా ఆవిర్భావం అనంతరం ఆయా జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు సమీకృత కలెక్టరేట్‌తో పాటు పట్టణంలో సైతం ఏర్పాటయ్యాయి.

కీలక శాఖల్లో సైతం...

ఓ వైపు పాలనాధికారి, అదనపు పాలనాధికారి లేకపోగా మరో వైపు కీలక ప్రభుత్వ శాఖల్లో సైతం జిల్లా అధికారులు లేరు. జిల్లా అల్ప సంఖ్యాక, ఎస్సీ సంక్షేమ శాఖ, జిల్లా యువజన, క్రీడల శాఖ, పౌర సరఫరాల సంస్థ డీఎం పోస్టుల్లో కొద్దినెలలుగా అధికారులు లేకపోవడంతో ఇతర శాఖల అధికారులు ఇన్‌ఛార్జిలుగా కొనసాగుతున్నారు. పట్టణంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా పంచాయతీరాజ్‌ శాఖ సర్కిల్‌ కార్యాలయం ఉండగా ఇక్కడ ఎస్‌ఈగా పనిచేసిన సంజీవ్‌రావు సీఈగా పదోన్నతి రావడంతో సిద్దిపేట జిల్లా ఈఈని ఇన్‌ఛార్జిగా నియమించారు. జిల్లా ఖజానా శాఖ అధికారి గత జులైలో ఉద్యోగ విరమణ చేయగా, ఆయన స్థానంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ఏటీవో ఇన్‌ఛార్జి డీటీవోగా కొనసాగుతున్నారు. జిల్లా యువజన, క్రీడల అధికారి పోస్టును ఓ ఫిజికల్‌ డైరెక్టర్‌కు అప్పగించారు. గత నెలలో జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, పది నెలల క్రితం డిప్యూటీ సీఈవో కరుణశీల ఉద్యోగ విరమణ చేశారు. జడ్పీ సీఈవోగా డీపీవో శ్రీనివాస్‌కు ఇన్‌ఛార్జి అప్పగించగా, జడ్పీ డిప్యూటీ సీఈవో పోస్టు ఇంకా భర్తీ చేయలేదు. మరో వైపు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా పరశురాం నాయక్‌ కొన్నేళ్లుగా ఇన్‌ఛార్జిగానే కొనసాగుతుండటం గమనార్హం.

ఇబ్బందుల్లో ప్రజలు...

కీలకశాఖల అధికారులు లేకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచి పోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో రెండు పడక గదుల ఇళ్లు, వైకుంఠధామాలు, కల్లాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇతర శాఖల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వాటిని పరిశీలించి పనులు వేగిరం చేసేలా ఆదేశాలు జారీ చేసే అధికారులు లేకపోవడంతో పాలన స్తబ్దుగా మారింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అధికారుల నియామకం చేపడితేనే పాలనలో వేగం పెరిగి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పనులపై పర్యవేక్షణ పెరగనుంది.

ఇదీ చదవండి: ప్రయాణికులంటే ఈ చిరుతకు ఎంత ప్రేమో

Last Updated : Jan 15, 2021, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.