మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం అచ్చంపేట గ్రామంలో పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే పులి.. కుక్కపై దాడి చేసిందని గ్రామస్థులు తెలిపారు. గణ్యతండా సమీపంలో ఓ లేగదూడపై దాడి చేయగా.. త్రుటిలో తప్పించుకుని వచ్చిందని చెప్పారు. అటవీ ప్రాంతంలో కొండగొర్రెను చంపి తిన్న ఆనవాళ్లున్నాయని వెల్లడించారు.
రాత్రి సమయంలో పులి గాండ్రింపు వినిపిస్తోందని గ్రామస్థులు తెలిపారు. బయటకు వెళ్లాలంటేనే వణుకు పుడుతోందని, అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
- ఇదీ చూడండి : వ్యర్థాలతో కరెంట్ ఉత్పత్తి.. విద్యుత్ శాఖ శ్రీకారం