మెదక్ జిల్లా జనకంపల్లిలో మార్గం నిర్మల అనే వివాహిత అనుమానాస్పద స్థతిలో మృతి చెందింది. ఆమె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అత్తింటివారు తెలిపారు. నిర్మల మృతికి భర్త కుటుంబ సభ్యులే కారణమంటూ పుట్టింటి వారు.. భర్త ఇంటిపై దాడికి దిగారు. ఇల్లు ధ్వంసం చేయటంతో పాటు పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించారు.
గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వల్ల పోలీసులు అక్కడికి చేరుకుని దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు నిర్మలను అత్తింటివారు పథకం ప్రకారం హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి బంధువులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: మరింత స్వేచ్ఛ ఇచ్చినప్పుడే కేంద్ర లక్ష్యం నెరవేరుతుంది : కేటీఆర్