ETV Bharat / state

దొంతిలో కరోనాతో మహిళ మృతి.. అధికారుల అప్రమత్తం

మెదక్​ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో ఓ మహిళ కరోనాతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న అధికారులు మహిళ కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్​లో ఉంచారు. గ్రామంలో హైపోక్లోరైట్​ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.

a women died due to corona in medak district
దొంతిలో కరోనాతో మహిళ మృతి.. అధికారుల అప్రమత్తం
author img

By

Published : Jun 18, 2020, 7:52 PM IST

మెదక్‌ జిల్లాలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఈ వైరస్​ బారిన పడి ఓ మహిళ మృతి చెందింది. శివ్వంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన మహిళ 3 రోజుల క్రితం అనారోగ్యంతో ఉస్మానియా అస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందింది.

విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి భవాని, తహసీల్దార్ భాను ప్రకాశ్​లు గ్రామానికి వెళ్లి మహిళ వివరాలను సేకరించారు. వారి కుటుంబ సభ్యులు 19 మందిని గృహ నిర్బంధం చేశారు. అనంతరం గ్రామంలో హైపోక్లోరైట్​ ద్రావణాన్ని పిచికారీ చేశారు. గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇదీచూడండి: కరోనాపై మీరు చేస్తున్నది సరిపోదు.. సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.