ETV Bharat / state

జిల్లాలో 3,200 మంది సూపర్ స్ప్రెడర్లకు త్వరలో వ్యాక్సినేషన్​ - సూపర్ స్ప్రేడర్లకు వ్యాక్సినేషన్​

మెదక్​ జిల్లాలో సూపర్ స్ప్రెడర్లకు ఈ నెల 28, 29న కరోనా టీకా వేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హరీశ్​ అధికారులతో సమావేశం నిర్వహించారు. సంబంధిత అధికారులతో ఏర్పాట్ల పర్యవేక్షణపై చర్చించారు.

medak district collector harish
జిల్లాలో 3,200 మంది సూపర్ స్ప్రేడర్లకు త్వరలో వ్యాక్సినేషన్​
author img

By

Published : May 26, 2021, 7:43 PM IST

మెదక్​ జిల్లాలో 3,200 మంది సూపర్ స్ప్రెడర్​లను (వాహకులు) గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ యస్.హరీశ్​ తెలిపారు. చౌక ధర దుకాణ డీలర్లు, హెల్పర్లు, ఎల్.పి.జి. డిస్ట్రీబ్యూటర్లు, శ్రామికులు, పెట్రోల్ బంక్ శ్రామికులు, ఎరువులు, రసాయనాలు, విత్తన డీలర్ దుకాణాల్లో పనిచేస్తున్నకార్మికులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది, ఫొటోగ్రాఫర్లకు టీకా వేయుటకు గుర్తించామని ఆయన అన్నారు. వారికి ఈ నెల 28, 29న కొవిడ్​ వ్యాక్సినేషన్​ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

అందుకోసం జిల్లాలోని ఏడు ప్రాంతాలు మెదక్, తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్, కౌడిపల్లి, పాపన్నపేట, పెద్ద శంకరంపేట్​లలో వ్యాక్సినేషన్​ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని పాలనాధికారి చెప్పారు. మండలాల పరిధిలోని పీహెచ్​సీ కేంద్రాల్లో వ్యాక్సినేషన్​ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తీసుకోవాలని వెల్లడించారు. ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్నిసంబంధిత మండల ప్రత్యేక అధికారులు పూర్తిగా బాధ్యత తీసుకుని… ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్​ కోరారు.

వ్యాక్సినేషన్ చేసుకోబోతున్నవారు తప్పనిసరిగా తమ వెంట గుర్తింపు కార్డుతోపాటు, ఆధార్​ కార్డు జిరాక్స్ ప్రతి తీసుకెళ్లాలని… దానిపై తప్పనిసరిగా ఫోన్ నెంబర్ రాయాలని సూచించారు. అదే విధంగా టీకాలు వేసుకోవడానికి వెళ్లే వారిని నియంత్రించ వద్దని పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేశ్​, డి.ఎస్.ఓ. శ్రీనివాస్, జిల్లా వ్యవసాయా అధికారి పరశురాం నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సంబంధాల అధికారి శాంతి కుమార్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: విదేశీ విద్యాపథకానికి దరఖాస్తు గడువు పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.