వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంగా వెంకటస్వామి అనే యువకుడికి రూ. 12 లక్షలు జరిమానా విధించిన సంఘటన మెదక్ జిల్లా మెదక్ మండలంలోని రాయిన్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఇంత మొత్తంలో డబ్బు తాను కట్టలేనని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని అతని తండ్రి పోచయ్య తన గోడు వెళ్లబోసుకున్నాడు.
జిల్లాలోని మెదక్ మండలం పరిధిలోని రాయిన్పల్లి గ్రామానికి చెందిన నీరుడి వెంకటస్వామి అనే యువకుడు అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు మూడు నెలల క్రితం వేరే వ్యక్తితో వివాహం జరిగింది. గత కొద్ది రోజులుగా వీరు ఫోన్లో సంభాషణ కొనసాగిస్తున్నారు.
బుధవారం తన వద్దకు రావాలని వివాహిత వెంకటస్వామికి ఫోన్ చేసింది. అక్కడికి వెళ్లిన అతన్ని గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రాయిన్పల్లి గ్రామ పెద్దలు వెంకటస్వామికి రూ. 12లక్షలు జరిమానా విధించారు. ఈ మెుత్తాన్ని మూడు నెలల్లోగా చెల్లించాలని ఆదేశించారు. అంత పెద్ద మొత్తం కట్టలేనని బాధితుని తండ్రి నిరుడి పోచయ్య తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఈ విషయమై మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడంలేదని వాపోయాడు.
ఇదీ చదవండి: 'రాష్ట్రంలో డ్రైరన్ సంతృప్తికరంగా సాగుతోంది'